Logo
Download our app
మూడో టెస్టులోనూ టీమిండియా ఓటమి
NEWS   Nov 03,2024 10:20 am
న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా మళ్లీ ఘోర ఓటమి. మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. 3 టెస్టు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. మూడో టెస్టులో భాగంగా ఆదివారం రెండో ఇన్నింగ్స్ లో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పంత్ క్రీజులో నిలదొక్కుకొని 64 పరుగులు చేశాడు. మళ్లీ వెంట వెంటనే వికెట్లు పడటంతో 121 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది.
⚠️ You are not allowed to copy content or view source