Logo
Download our app
వ‌డ్లను కొనుగోలు చేయాలంటూ ధర్నా
NEWS   Nov 03,2024 06:40 am
ఎల్లారెడ్డిపేట: రైతుల నుండి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని నిరసిస్తూ రైతులందరూ ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. వడ్లను రోడ్డు మీద పోసి నిరసనను తెలుపుతున్నారు. సుమారు 20 నిమిషాలుగా ధర్నా చేపట్టడంతో ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source