ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు
NEWS Nov 02,2024 04:59 pm
తెలంగాణలో ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాల్లో పాట్నాలో ఉన్నదే అత్యంత ఎత్తయింది. దీని ఎత్తు 72 అడుగులు.