Logo
Download our app
రైతుబంధు కోసం పాదయాత్ర చేస్తా
NEWS   Nov 02,2024 04:20 pm
రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు నవంబర్ 12లోగా చెల్లించకపోతే కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేపడుతామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శనివారం ఆయన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోళ్లను వెంటనే జరిపి డబ్బులను చెల్లించాలన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source