పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
NEWS Nov 02,2024 12:47 pm
పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడి వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. సిసిటిఎన్ఎస్ కోర్ట్ కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి వృత్తి పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.