నవంబర్‌లో చలి తక్కువే: వాతావరణశాఖ
NEWS Nov 02,2024 05:50 am
సాధారణంగా నవంబర్ నెలలో చలి గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. నవంబర్‌లోనూ ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది. నవంబర్‌లో చలికి వాయవ్య భారతదేశం నుంచి వీచే గాలులే కారణం కాగా ఈసారి అక్కడ గాలులు వీచకపోవడంతో చలి ఎక్కువగా ఉండే అవకాశం లేదంది.