రక్తదానం చేసిన ఆర్టీసీ కండక్టర్
NEWS Nov 01,2024 07:13 pm
బోసు బొమ్మ సెంటర్ వైష్ణవి హాస్పిటల్లో రోలుపడి గ్రామపంచాయతీ సురవరం గ్రామానికి చెందిన కోమటి స్వాతికి యాక్సిడెంట్ జరిగి చికిత్స పొందుతుంది. ఆమెకి అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని తెలియగా తిరువూరు హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ మర్సకట్ల కుమార్ న్యాయవాదిని ఫోన్లో సంప్రదించారు. వెంటనే స్పందించిన కుమార్ గ్రూపు సభ్యుడైన రామకృష్ణ (తిరువూరు డిపో ఆర్టీసీ కండక్టర్)కి తెలపగా నిమిషాల వ్యవధిలో హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు.