Logo
Download our app
జగిత్యాల: నేటి నుండి పోలీసు యాక్ట్ అమలు
NEWS   Nov 01,2024 01:47 pm
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నవంబర్ 1 నుండి 30 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ తెలిపారు. దీని ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించకూడ‌ద‌ని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source