అఘోరీ ఇంటి దగ్గర హై టెన్షన్
NEWS Nov 01,2024 11:46 am
నవంబర్ 1న సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పిన లేడీ అఘోరీ నాగసాధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. HYD వెళుతుండగా రాత్రి ఆమెను సిద్ధిపేటలో పోలీసులు అడ్డుకున్నారు. ఆమె స్వగ్రామం మంచిర్యాల జిల్లా కుశనపల్లికి తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించి హౌస్ అరెస్ట్ కొనసాగిస్తున్నారు. అఘోరీ ఇంటి దగ్గర 144సెక్షన్ మధ్య హైటెన్షన్ నెలకొంది.