ఉచిత గ్యాస్ సిలిండర్‌కు వేళాయే
NEWS Nov 01,2024 06:44 am
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ కానుకగా ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో దీపం-2 పథకం సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను సీఎం పంపిణీ చేస్తారు.