జగిత్యాలలో అగ్ని ప్రమాదం
NEWS Nov 01,2024 07:07 am
జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో అమ్మాజీ డ్రెస్సెస్‌లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సార్గమ్మ వీధిలో గల అమ్మాజీ డ్రెస్సెస్ కు చెందిన 3 షెటర్స్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో షాపులో ఉన్న బట్టలు, ఇతర సామాగ్రి, కొంత నగదు కాలి బూడిద అయ్యాయి. షాప్ యజమాని మాట్లాడుతూ.. సుమారు రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.