వాలీబాల్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
NEWS Nov 01,2024 04:54 am
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన ముత్యాల సుధా-అశోక్ రెడ్డిల కుమారుడు ముత్యాల మనోజ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుండి అండర్ 17 వాలీబాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మనోజ్ బొప్పాపూర్ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతూ.. ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్‌లో మండల జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు. జాతీయ స్థాయిలో నవంబర్‌లో 6 నుండి 10 మధ్యలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొంటాడు.