Logo
Download our app
ధాన్యం కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
NEWS   Oct 31,2024 01:38 pm
ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో 2 రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ల వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source