సర్దార్ సాక్షిగా ప్రధాని మోదీ ప్రమాణం
NEWS Oct 31,2024 04:46 am
తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. సర్దార్ జయంతి సందర్భంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ (గుజరాత్) వద్ద పుష్పాంజలి ఘటించారు. సర్దార్ సేవల్ని గుర్తు చేసుకుంటూ జాతి సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. ఐకమత్యమే మా విధానం అని సర్దార్ సాక్షిగా మోదీ ప్రమాణం చేశారు. అనంతరం జవాన్లు చేసిన అద్భుత విన్యాసాలు అదరహో అనిపించాయి.