విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
NEWS Oct 31,2024 04:09 am
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల దేవిశ్రీ గార్డెన్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లు ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో స్తంభం పూర్తిగా నెలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.