కాశి బాగ్ ఆలయంలో చోరీ
NEWS Oct 30,2024 09:56 am
మెట్‌పల్లిలో పురాతన ఆలయమైన కాశీబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున ఓ దొంగ ఆలయంలో దూరి దొరికిన వస్తువు వల్ల దోచుకెళ్లాడు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో ముఖానికి గుడ్డ కట్టుకుని ఇనుప రాడుతూ ఆలయానికి ఉన్న తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి ఇక్కడికి సంబంధించిన పూజా సామాగ్రిని పూజారి పంచలో కట్టుకొని దర్జాగా వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు బంధించాయి. ఇప్పుడు ఆ సీసీ కెమెరాల దృశ్యాలు వాట్సాప్ గ్రూప్ లలో చక్కర్లు కొడుతున్నాయి.