రెండు బైకులు ఢీ - ఒకరి మృతి
NEWS Oct 29,2024 04:44 pm
జగిత్యాల మండలంలోని తిప్పన్నపేట గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో గుట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన బొద్దుల నాగేష్ గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.