Logo
Download our app
జగిత్యాల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
NEWS   Oct 29,2024 04:34 pm
కొండగట్టు: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన కొండగట్టులో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు స్టేజి సమీపంలో గల శ్రేయాన్ లాడ్జి వద్ద నడుచుకుంటూ వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్టు మల్యాల ఎస్సై నరేష్ తెలిపారు. మరణించిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source