కొండగట్టులో భక్తుల రద్దీ
NEWS Oct 29,2024 12:10 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మంగళవారం వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. ముందుగా తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో స్నానమాచరించి స్వామివారి సేవలో తరించారు. అర్చకులు స్వామివారికి అభిషేకాలను, అర్చనలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులకు ధర్మ దర్శనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.