ప్రపంచ రికార్డుకు అయోధ్య సిద్ధం!
NEWS Oct 08,2025 11:07 am
అయోధ్య: ఈ ఏడాది కూడా ఒకేసారి అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు అయోధ్య సిద్ధమైంది. ఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు సరయూ నదీ తీరంలో ‘దీపోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే గతేడాది ఏకంగా 25 లక్షల దీపాలు ఒకేసారి వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది 28 లక్షల దీపాలతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాలని UP ప్రభుత్వం భావిస్తోంది.