Logo
Download our app
ఎన్ఎస్పీ కాల్వలపై గండ్లు పూడ్చాలి
NEWS   Oct 28,2024 01:38 pm
ఎన్ఎస్పీ కాల్వలపై గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వెంకట కృష్ణప్రసాదు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎన్ఎస్పీ అధికారులతో సమావేశం నిర్వహించారు. గండ్లు పూడ్చివేతతో ఎన్ఎస్పీ జలాలు సవ్యంగా సరఫరా అయ్యేవిధంగా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నవంబర్ 15నుంచి సాగరజలాలు విడుదల చేయనున్న దృష్ట్యా ఎటువంటి ఆటంకాలు లేకుండా కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source