Logo
Download our app
ఒమన్ లో ఒడ్డెలింగాపూర్ వాసి మృతి
NEWS   Oct 27,2024 06:06 am
రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి అశోక్ (39) ఒమాన్ దేశంలో గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. అశోక్ ఏడాది క్రితం ఉపాధి నిమిత్తం ఒమాన్ దేశం వెళ్లారు. శనివారం కంపెనీలో పని చేస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి పంపించాలని బంధువులు కోరుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source