ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్టు
NEWS Oct 26,2024 05:50 pm
చిత్తూరు నగరంలోని ఎస్టేట్ వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. మణికంఠ, శేఖర్, మురుగేషన్ పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి రూ. 6,100 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని తహశీల్దార్ ముందు హాజరుపరచి ఒక్కొక్కరికి రూ. లక్ష పూచికత్తుతో బైండోవర్ చేశామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు ప్రజలు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.