Logo
Download our app
ఎస్ఐ సతీష్ జ్ఞానదీప్ స‌న్మానం
NEWS   Oct 26,2024 03:15 am
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందే సతీష్ జ్ఞానదీప్ హైస్కూల్‌లో చదివి ఎస్ఐగా ఉద్యోగం పొందారు. కరీంనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ చదువుకున్న పాఠశాలకు వచ్చిన అందే సతీష్‌ను పాఠశాల చైర్మన్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ అభినందించి స‌త్క‌రించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులు చెప్పినట్లుగా విని చదువుకుంటే భవిష్యత్తు బాగుపడుతుందని, ఉన్నత స్థాయిలో ఎదుగుతామని విద్యార్థులను సూచించారు. సతీష్‌ను స్కూల్ చైర్మన్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source