Logo
Download our app
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS   Oct 25,2024 03:54 pm
నర్సాపూర్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే అమ్మి మద్దతు ధర పొందాలని తెలిపారు. ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీవో శ్రీనివాస్, గౌరీశంకర్, అధికారులు, మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source