నీటి కోసం మహిళల ఆందోళన
NEWS Oct 25,2024 05:13 pm
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిందెలను ధ్వంసం చేశారు. అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ నీటిని కంపెనీలకు అమ్ముకోవడంతోనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.