Logo
Download our app
క్రిప్టో కరెన్సీ: 2 వేల కోట్ల దందా
NEWS   Oct 25,2024 03:44 am
క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ. 2 వేల కోట్ల దందా జరిగింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తూ రెండేళ్లలో విదేశాలకు వేల కోట్లు తరలించారు. ఇటీవ‌ల‌ నిర్మల్ జిల్లాలో 5గురిపై, తాజాగా జగిత్యాలలో రెక్సోస్ పేరిట చేసిన ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 37 మంది సెవన్ స్టార్లు ఉంటే, జగిత్యాల జిల్లా నుంచే 7గురు 7 స్టార్లు ఉండగా, వీరంతా సుమారు రూ.500 కోట్ల వరకు పలువురితో ఇన్వెస్ట్ చేయించారు. త్రీ స్టార్కు లక్ష , ఫోర్ స్టార్కు రూ. 3 లక్షలు, ఫైవ్ స్టార్కు ఫార్చునర్ కారు, సెవన్ స్టార్కు దుబాయిలో విల్లా లేదా రూ. 3.5 కోట్ల నగదు ఇస్తూ బిజినెస్ను విస్తరించారు. జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, హైదరాబాద్ తో పాటు ఆయా ప్రాంతాల్లో లింక్ ఉన్న ఇతర ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, బడా వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, ఉద్యోగులు, ఆధికారులు, రియల్టర్లు, రాజకీయ నేతలు ఫాస్ట్ రిటర్న్స్పై ఆశతో భారీగానే ఇన్వెస్ట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source