తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భూమానందం
NEWS Oct 24,2024 05:02 pm
కోరుట్ల: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోరుట్ల పట్టణానికి చెందిన వాసం భూమానందం నియమితులయ్యారు. ఈ మేరకు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ చేనేత ఐక్య వేదిక బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయనను పలువురు అభినందించారు.