మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
NEWS Oct 24,2024 04:28 pm
అనంతగిరి మండలంలోని కివర్ల పంచాయితి జాలాడ గ్రామంలో అనంతగిరి ఎస్ఐ శ్రీనివాసరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి నాటుసారా క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గిరి మహిళ పోలీస్ మీనాక్షి, గ్రామపెద్దలు దూర్య నూకరాజు, బాదాం నాగేశ్వరరావు పాల్గొన్నారు.