తారకరత్న కూతురు హాఫ్ శారీ ఫంక్షన్
NEWS Oct 24,2024 01:40 pm
దివంగత నందమూరి హీరో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన పెద్ద కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించారు. ఫోటోలను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫంక్షన్‌లో తారకరత్న ఫోటో పెట్టి ఆయనకు నివాళులు అర్పించి వేడుక నిర్వహించారు, నిష్క హాఫ్ శారీలో వచ్చి నాన్నకి నివాళులు అర్పించింది. ఈ ఫంక్షన్ అలేఖ్య రెడ్డి పెదనాన్న, వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేతుల మీదుగా జరిగినట్టు తెలుస్తుంది. గత ఏడాది తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.