అయినవిల్లి ఎంపీడీవోగా భీమారావు
NEWS Oct 24,2024 01:34 pm
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా జి. భీమారావు విధులలో చేరారు. అంబాజీపేట పంచాయతీ విస్తరణాధికారిగా పనిచేస్తున్న ఆయన అయినవిల్లి ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, అయినవిల్లి తహసీల్దార్ నాగలక్ష్మమ్మ, పంచాయతీ విస్తరణ అధికారి వాణి కుమారి బెహరా ఆయనను అభినందించారు.