SP కార్యాలయం ఓపెన్ హౌస్ కార్యక్రమం
NEWS Oct 24,2024 10:46 am
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్నిరిబ్బన్ కట్ చేసి లాంఛనంగా నిర్వహించారు. మెదక్ టౌన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ సందర్బంగా విద్యార్థులకు పోలీస్ చట్టాల పట్ల, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు,సైబర్ నేరాల పట్ల వారికీ వివరించారు.