పద్మజను సత్కరించిన బీజేపీ యువమోర్చా
NEWS Oct 24,2024 10:41 am
రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ తుమ్మల పద్మజను ఈరోజు అమలాపురంలో బీజేపీ యువమోర్చా నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యులు కాసిన ఫణీంద్ర, కటికిరెడ్డి గంగాధరం, కోటిపల్లి దామోదర్, నాళం మణి ప్రకాష్, బుద్ధ వరపు రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యనమదల వెంకటరమణ పాల్గొన్నారు.