చికిత్స పొందుతూ యువకుడు మృతి
NEWS Oct 24,2024 10:47 am
గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మల్యాల మండలంలోని కొండగట్టు దొంగల మర్రి ప్రాంతంలో గత ఆదివారం ఇద్దరు యువకులకు జరిగిన బైక్ యాక్సిడెంట్ లో తలకు తీవ్ర గాయాలైన బల్వంతాపూర్ కు చెందిన చిర్ర అభి(20)ని హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు.