మెట్‌పల్లి మార్కెట్ కమిటీ
నియామకంపై ఉత్కంఠ!
NEWS Oct 24,2024 11:00 am
కోరుట్ల నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయింది. నియోజకవర్గంలో 4 మార్కెట్ కమిటీలు ఉండగా మూడింటికి నియామకం పూర్తి చేశారు. అటు వ్యాపారులకు ఇటు రైతులకు మధ్య అనుసంధానంగా ఉంటూ పనిచేయాల్సిన 3 కమిటీల నియామకం పూర్తయింది. అయితే మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకంపై ఉత్కంఠ నెలకొంది. కమిటీ ఏర్పాటుపై నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.