డ్రైవర్ నిర్లక్ష్యంతోనే విద్యారి మృతి,
కేసు నమోదు: సిఐ రేణుక రెడ్డి
NEWS Oct 24,2024 07:39 am
పెద్దశంకరంపేట: నిర్లక్ష్యంతో బస్సు నడిపి పెద్దశంకరంపేట మండలం మక్త లక్ష్మపూర్ గ్రామనికి చెందిన విద్యార్థిని అశ్విని మృతికి కారణమైన డ్రైవర్ పై,శ్రీ సాయి చైతన్య పాఠశాల యాజమాన్యం పై కేసు నమోదు చేసినట్టు అల్లదుర్గం సిఐ రేణుక రెడ్డి తెలిపారు. నిబంధనలు పాటించకుండా బస్సులో హెల్పర్ ను ఏర్పాటు చెయ్యకుండా నిర్లక్ష్యం వహించిన పాఠశాల యజమాని గంగాధర్ గౌడ్ పై కేసు నమోదు చేశామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.