తాగిన మైకంలో కూతుర్ని అమ్మిన తల్లి?
NEWS Oct 24,2024 04:42 am
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేములవాడకు చెందిన శ్యామల అనే మహిళకు ఐదుగురు పిల్లలు కాగా, అందులో తన 10 నెలల చిన్నారిని జగిత్యాలకు చెందిన ఓ మహిళకు కల్లు తాగిన మైకంలో రూ. లక్షకు విక్రయించింది. మైకం నుండి తేరుకున్న అనంతరం శ్యామల తన పాపను ఎవరో అపహరించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.