జనసేనలో చేరనున్న మాజీ హోంమంత్రి
NEWS Oct 24,2024 02:58 am
మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత YCPకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఆమె తన భర్త దయాసాగర్‌తో కలిసి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో ఇటీవల చర్చలు జరిపారనీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినపడుతోంది. నాగబాబు స్విట్జర్లాండ్ పర్యటన నుంచి రాగానే సుచరిత జనసేనలో చేరతారని ఇటు వైసీపీ, అటు జనసేన శ్రేణులు చెప్పుకొస్తున్నారు. నవంబర్ తొలి వారంలో సుచరిత రాజకీయ కొత్త అడుగులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.