గోపురం వద్దనే దుర్గ మాతకు పూజలు
NEWS Oct 24,2024 02:42 am
పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి శివారులోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు గురువారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బృహస్పతి వాసరే అష్టమి పురస్కరించుకొని విశేష పూజ కార్యక్రమాలు చేపట్టారు. పంచామృతాలు, గంగాజలంతో ప్రత్యేక అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం మహా మంగళ హారతి ఇచ్చారు.మంజీరా నది ఉదృతంగా ప్రవహించడంతో అమ్మవారిని గోపురం వద్దనే భక్తలు దర్శించుకుంటున్నారు.