సిసి రోడ్డు పనులు ప్రారంభం
NEWS Oct 24,2024 02:43 am
జోగిపేట మున్సిపల్ పట్టణంలోని 1వ వార్డులో రూ. కోటి నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను వార్డ్ కౌన్సిలర్ డాకురి శివ శంకర్, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్యతో కలిసి సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.ఎస్ఆర్ఎం కాలేజీ నుండి రిక్షా కాలనీ కోర్టు, రోడ్డు మార్గంలో ఈ నూతన సిసి రోడ్డు పనులు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 1వార్డ్ కౌన్సిలర్ డాకూరి శివశంకర్, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య 18 వార్డ్ కౌన్సిలర్ సురేందర్ గౌడ్, డాకూరి వెంకటేశం,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.