Logo
Download our app
బస్సు ఢీ కొని విద్యార్థిని మృతి..
NEWS   Oct 24,2024 02:47 am
పెద్ద శంకరంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులో స్కూలు బస్సు ఢీకొని విద్యార్థిని మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు..మండలానికి చెందిన శ్రీ సాయి చైతన్య ప్రైవేట్ విద్యా సంస్థ బస్సు లక్ష్మపూర్ గ్రామానికి చెందిన బోయిని అశ్విని (6) ను వెనకాల నుండి బస్సుతో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. సిఐ రేణుక రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source