సోనియాని కలిసిన CM రేవంత్ రెడ్డి
NEWS Oct 23,2024 05:52 pm
కేరళలోని వయనాడ్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.