ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు
NEWS Oct 23,2024 05:40 pm
దానా తుఫాను ప్రభావం కారణంగా ఏపీలో రెండ్రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దానా తుఫాను కారణంగా గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 80-100కిమీ వేగంతో వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ 25న తీవ్ర తుఫానుగా తీరంగా దాటే అవకాశం ఉందని హెచ్చరించింది.