దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?
NEWS Oct 23,2024 04:58 pm
దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి అక్టోబర్ 31న మ.3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సా.6.16 ని.కు ముగుస్తుంది. దీని ప్రకారం 31న సా. 5.36 నుంచి 6.16 వరకు లక్ష్మీ పూజ ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే దృక్ పంచాంగం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1న దీపావళి జరుపుకోనున్నారు.