ఉచిత అంబులెన్స్ కేటాయింపు
NEWS Oct 23,2024 06:05 pm
మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో ఆందోల్ నియోజకవర్గంలోని రేగోడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఏంఆర్ఎఫ్ ట్రస్ట్ తమ సిఎస్ఆర్ ఫండ్ నిధులతో ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ అంబులెన్స్‌ను ఎంఆర్ఎఫ్ ట్రస్ట్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందజేశారు.