రైల్వే కోడూరు: మద్యం దుకాణాన్ని
తొలగించాలని సిఐటియు నిరసన
NEWS Oct 23,2024 05:04 pm
రైల్వే కోడూరులోని ఓ కాంప్లెక్స్ వద్ద మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని మహిళలు, విద్యార్థులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైల్వేకోడూరు ఎక్సైజ్ CIకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ.. అక్కడ ఉన్నది తాత్కాలిక దుకాణం మాత్రమేనని 10 రోజుల్లో తొలగిస్తామని హామీ ఇచ్చారు.