Logo
Download our app
రోడ్డు సౌకర్యం క‌ల్పించండి
NEWS   Oct 23,2024 05:09 pm
అల్లూరి జిల్లా: అనంతగిరి మండలంలో కొండిబ పంచాయతీ డుంబ్రిగుడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు డిమాండ్ చేశారు. త‌మ‌ గ్రామానికి 20 కుటుంబాలు ఉండి 82 మంది స్థానిక ప్రజలు నివసిస్తు జీవిస్తున్నామని చెప్పారు. నిత్యవసరం కోసం ముళ్ల బాటలోనే రాకపోకలు కొనసాగిస్తున్నామని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డోలిమోతలకే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు, చొరవ తీసుకొని త‌మ‌ గ్రామానికి 2 కిలోమీటర్లు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source