సంయుక్త కలెక్టర్ ఇసుక రీచ్ తనిఖీ
NEWS Oct 23,2024 05:10 pm
నందలూరు మండలం టంగుటూరు ఇసుక రీచ్ ను జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టంగుటూరు ఇసుక రీచ్ కు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. టంగుటూరు ఇసుక రీచ్ నుంచి రోజు వారి ఎంత ఇసుకను తరలిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ పక్కాగా అమలు అవ్వాలని, ఎటువంటి అవకతవకలకు తావివ్వరాదని అధికారులను ఆదేశించారు.