తప్పిపోయిన బాలిక ఆచూకీ లభ్యం
NEWS Oct 23,2024 05:11 pm
రాయచోటి: తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక రోషిణి ఆచూకీని రాయచోటి పట్టణ పోలీసులు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్, సిబ్బంది కనుగొన్నారు. బుధవారం ఉదయం బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంటల వ్యవధిలోనే గుర్తించి, తమ కుమార్తెను అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ జగన్ కూడా పాల్గొన్నారు.