బాధితులకు ఎల్ఓసి చెక్కులు
NEWS Oct 23,2024 05:21 pm
మెట్‌పల్లి: పలు అనారోగ్యలతో బాధపడుతున్న బాధితులకు మంజూరైనా ఎల్ఓసి చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వారికి అందించారు. మెట్‌పల్లి పట్టణానికి చెందిన మార్గం భూదేవికి మంజూరైన 1,50,000 రూపాయలు ఇబ్రహీంపట్నంకి చెందిన బి.సాయికుమార్‌కు 2 లక్షల రూపాయలు. కోరుట్ల పట్టణానికి చెందిన పి.నరేష్ మంజూరైన 75,000 రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కులను బాధితులకు అందించారు.